శుభవార్త.. కైలాస్ మానస సరోవర్ యాత్ర ఎప్పటి నుంచి అంటే?

మానస సరోవర్ యాత్ర ప్రారంభం కానుంది. భారతీయులు అత్యంత ఎక్కవగా ఇష్టపడే ఈ యాత్రకు చైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది

Update: 2025-01-28 05:55 GMT

మానస సరోవర్ యాత్ర ప్రారంభం కానుంది. భారతీయులు అత్యంత ఎక్కవగా ఇష్టపడే ఈ యాత్రకు చైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కైలాస మానస సరోవర్ యాత్రను తిరిగి ప్రారంభించాలని చైనా - భారత్ లు నిర్ణయించారు. ఈ మేరకు రెండు దేశాలు ఒక అంగీకారానికి వచ్చాయి. కైలాస మానస సరోవర్ యాత్ర తిరిగి ప్రారంభం కానుండటంతో భారతీయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

రెండు దేశాల మధ్య...
ఈ యాత్రతో చైనా - భారత్ ల మధ్య మరింత సంబంధాలు బలోపేతం కానున్నాయి. ఇప్పటికే సరిహద్దు ప్రాంతాల్లో మొహరించిన సైన్యాన్ని వెనక్కు పిలిపించేందుకు రెండు దేశాలు ఒక నిర్ణయానికి వచ్చాయి. అంగీకారాన్ని తెలిపాయి. దీంతో రెండు దేశాల మధ్య శాంతి నెలకొంటుందని భావిస్తున్నారు. దీంతో పాటు కైలాస్ మానస సరోవర్ యాత్రకు కూడా ఇరు దేశాలు అంగీకారం తెలిపాయి. ఈ ఏడాది మే నెల తర్వాత ఈ యాత్ర ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి. 2020 తర్వాత ఈ యాత్ర నిలిచిపోయింది.


Tags:    

Similar News