పెళ్ళైన రెండు రోజులకే.. తిరిగొస్తానని చెప్పి

26 ఏళ్ల భవిక్ మహేశ్వరి రెండు రోజుల క్రితం గుజరాత్‌లోని వడోదరలో కోర్టులో వివాహం చేసుకున్నాడు.

Update: 2025-06-14 10:00 GMT

26 ఏళ్ల భవిక్ మహేశ్వరి రెండు రోజుల క్రితం గుజరాత్‌లోని వడోదరలో కోర్టులో వివాహం చేసుకున్నాడు. లండన్‌లో ఉద్యోగం చేస్తూ సెలవుల్లో వచ్చిన పెళ్లికుమారుడు భవిక్‌ రెండు రోజుల కిందట పెళ్లి చేసుకున్నాడు. గురువారం మధ్యాహ్నం నవవధువుతోపాటు అందరూ అహ్మదాబాద్‌ విమానాశ్రయానికి వచ్చి భవిక్‌కు వీడ్కోలు పలికారు.


వీరంతా ఇళ్లకు కూడా చేరకముందే విమాన ప్రమాద వార్త వినాల్సి వచ్చింది. అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానంలో ఉన్న 241 మందిలో భావిక్ కూడా ఉన్నాడు. త్వరలోనే తిరిగి వస్తానని చెప్పిన భవిక్ తిరిగిరాని లోకాలకు చేరుకున్నాడు.

Tags:    

Similar News