నేటి నుంచి జేఈఈ మెయిన్స్‌

నేటి నుంచి జేఈఈ మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం మధ్యాహ్నం ఈ పరీక్షలు జరగనున్నాయి

Update: 2025-01-22 02:49 GMT

నేటి నుంచి జేఈఈ మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం మధ్యాహ్నం ఈ పరీక్షలు జరగనున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఇందుకోసం ప్రత్యేకంగా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాలలో అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు అర నిమిషం ఆలస్యమయినా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.

రెండు విడతలుగా...
ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జేఈఈ మెయిన్స్ జరుగుతుంది. పరీక్షను ఆన్‌లైన్‌లో రాయాల్సి ఉంటుంది. ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను కేంద్రంలోకి అనుమతించరు. విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు కోరారు.


Tags:    

Similar News