దేశంలోనే ధనిక సీఎం జగన్
దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ అని తేలింది. అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రీఫామ్స్ వెల్లడించింది.
దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ అని తేలింది. అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రీఫామ్స్ వెల్లడించింది. మొత్తం 39 మంది ముఖ్యమంత్రుల ఆస్తులను పరిశీలించగా అందులో 29 మంది కోటీశ్వరులేనని తేలింది. ఇందులో 510 కోట్ల రూపాయల ఆస్తులతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మొదటి స్థానంలో నిలిచారు. చిట్ట చివరి స్థానంలో పది హేను లక్షల రూపాయల ఆస్తులు ఉన్న ముఖ్యమంత్రి మమత బెనర్జీ అని తేల్చారు.
వ్యాపారి కావడంతోనే...
అయితే జగన్ స్వతహాగా వ్యాపారం నుంచి వచ్చిన నేత. తొలుత పారిశ్రామిక వేత్త. తండ్రి వైఎస్ మరణం తర్వాత ఆయన రాజకీయాలను ప్రధాన వృత్తిగా ఎంచుకున్నారు. అందుకే ఆ మేరకు ఆస్తులున్నాయని వైసీీపీ నేతలు చెబుతున్నారు. జగన్ రాజకీయాల్లోకి వచ్చి కూడా పన్నెండేళ్లు మాత్రమే అవుతుంది. అందుకే ఆయన ఆస్తులకు, రాజకీయాలకు సంబంధం లేదన్నది వైసీపీ నేతల వాదన. కానీ దేశంలోనే అతి సంపన్నులైన ముఖ్యమంత్రుల్లో మాత్రం జగన్ మొదటి స్థానంలో నిలవడం చర్చనీయాంశమైంది.
.