Heavy Rains : భారీ వర్షాలకు పాఠశాలలకు సెలవులు
ముంబయిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారత వాతావరణ శాఖ ముంబయి నగరానికి రెడ్ అలెర్ట్ ప్రకటించింది
heavy rainsin mumbai
ముంబయిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారత వాతావరణ శాఖ ముంబయి నగరానికి రెడ్ అలెర్ట్ ప్రకటించింది. విద్యాసంస్థలన్నింటికి ఈరోజు సెలవు ప్రకటించారు. ముంబయి నగరంలోని ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించింది. ముంబయి భారీ వర్షాలకు అతలాకుతలమవుతుంది.
అవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ...
వర్షాల వల్ల ముంబయిలో దాదాపు పథ్నాలుగు విమానాలను దారి మళ్లించారు. అలాగే అనేక రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. రేపటి వరకూ భారీ వర్షాలు పడే అవకాశముండటంతో అందరూ అప్రమత్తంగా ఉండాలని ముంబయి కార్పొరేషన్ హెచ్చరించింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అలెర్ట్‌గా ఉండాలని కోరింది. ముంబయి నగరంలో భారీ వర్షం కురిస్తే ఎక్కడ ట్రాఫిక్ అక్కడే నిలిచిపోతుంది. అందుకే ప్రజలను కూడా ముందుగానే హెచ్చరించి ఇళ్లలో ఉండి పోవాలని ఆదేశించింది.