జీఎస్టీ తగ్గించే వస్తువులివేనా.. వచ్చే నెలలో క్లారిటీ

సెప్టంబరులో జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది

Update: 2025-08-29 08:00 GMT

సెప్టంబరులో జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. జీఎస్టీ రేట్లలో భారీ మార్పులు చేయనున్నారు. ఆగస్టు పదిహనో తేదీన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దీపావళికి భారత ప్రజలకు భారీ బహుమతి ఇస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన నేపథ్యంలో సెప్టెంబర్‌ 4న జరగనున్న జీఎస్టీ కౌన్సిల్‌ తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ సమావేశంలో నిత్యావసర వస్తువులపై జీఎస్టీ ఐదు శాతానికి తగ్గింపు ఉండవచ్చని, పన్నీర్‌, పిజ్జా, చపాతి, రోటీ, పరోటాపై జీఎస్టీ ఎత్తివేస్తారని సమాచారం.

ఈ వస్తువులపై...
మ్యాప్‌లు, పెన్సిళ్లు, క్రేయాన్స్‌పై జీఎస్టీ ఎత్తివేస్తారని చెబుతున్నారు. వ్యవసాయ రంగానికి ఊరట కలిగేలా నిర్ణయం ఉంటుందని అంటున్నారు. వ్యవసాయ రంగంలో వాడే అన్ని పరికరాలు, ఎరువులపై జీఎస్టీ 12 నుంచి 5 శాతానికి తగ్గించే అవకాశాలున్నాయి. 30 రకాల క్యాన్సర్‌ డ్రగ్స్‌పై జీఎస్టీ ఎత్తివేస్తారని, అసాధారణ వ్యాధులకు వాడే మందులపై జీఎస్టీ ఉండకపోవచ్చని అంటున్నారు. అన్ని రకాల ఔషధాలపై జీఎస్టీ 12 నుంచి 5 శాతానికి తగ్గించే ఛాన్స్ ఉంది. రివాల్వర్‌, పిస్టల్స్‌, స్మోకింగ్‌ పైప్స్‌, సిగార్‌లపై 40 శాతం జీఎస్టీ విధించనున్నారు. రేసింగ్‌ కార్లు, 1200 సీసీ దాటిన వాహనాలపై 40 శాతం జీఎస్టీ.. 350 సీసీ దాటిన బైక్‌లపై 40 శాతం జీఎస్టీ విధించే అవకాశాలున్నాయి.


Tags:    

Similar News