ISRO బాహుబలి సక్సెస్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన సీఎంఎస్‌-03 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది.

Update: 2025-11-03 14:57 GMT

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన సీఎంఎస్‌-03 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. బాహుబలి రాకెట్‌గా పేరొందిన ఎల్‌వీఎం3-ఎం5 వాహకనౌక ద్వారా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశించింది. శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఆదివారం సాయంత్రం 5.26 గంటలకు ఇది నింగిలోకి బయల్దేరింది. 16 నిమిషాల 29 సెకన్లపాటు పయనించి 5.42 గంటలకు ఉపగ్రహాన్ని జియో సింక్రోనస్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌ లోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఇది ఇస్రో నుంచి 103వ ప్రయోగం. ఈ శాటిలైట్‌ 15 ఏళ్ల పాటు కమ్యూనికేషన్‌ సేవలు అందించనుంది. భారత భూభాగం నుంచి ఇస్రో ప్రయోగించిన అతి పెద్ద కమ్యూనికేషన్‌ ఉపగ్రహంగా నిలిచింది. భారీ శాటిలైట్లను ప్రయోగించడానికి ఇప్పటి వరకూ ఇస్రో ఫ్రాన్స్‌కు చెందిన ఎరియాన్‌-5 రాకెట్‌పై ఆధారపడేది. ఎల్‌వీఎం-3 వల్ల ఇకపై మన దేశం నుంచే ప్రయోగించేందుకు వీలు కలుగుతోంది.

Tags:    

Similar News