Narendra Modi : నేడు అయోధ్యలో మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు అయోధ్యలో పర్యటించనున్నారు
భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు అయోధ్యలో పర్యటించనున్నారు. అయోధ్య రామాలయంలో ఆయన ఇరవై రెండు అడుగుల కాషాయ జెండాను ఆవిష్కరించనున్నారు. రామజన్మభూమి ట్రస్ట్ సభ్యుల సమక్షంలో ప్రధాని మోదీ ఈ కాషాయ జెండాను ఆవిష్కరిస్తారు.ఈ కార్యక్రమాన్ని ధ్వజ్ ఆరోహణ్ గా పిలుస్తారు. ఈ కార్యక్రమం రాముడు - సీత వివాహ పంచమి ముహూర్తంతో సమానంగా జరుగుతుందని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.
కాషాయ జెండాను ఆవిష్కరించి...
ఆలయ శిఖరంపైన ఈ జెండాను ఉంచనున్నారు. ఈ కార్యక్రమానికి సాధువులు, సంత్ లు హాజరు కానున్నారు. అయోధ్య కాశీ దక్షిణ భారత దేశం నుంచి దాదాపు 108 మంది పండితులు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కొందరికి మాత్రమే అనుమతిస్తారు. అందుకే క్యూ ఆర్ కోడ్ తో అనుమతించనున్నారు మధ్యాహ్నం 2.30 గంటల వరకూ ఈ కార్యక్రమం జరగనుంది. దాదాపు ఆరువేల మంది అతిధులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించి ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.