ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్‌ను అరెస్ట్ చేసిన ఈడీ.. ఎందుకంటే..?
ఇన్‌స్టాగ్రామ్‌లో 12 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్న ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్‌ను ED అరెస్టు చేసింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో 12 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్న ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్‌ను ED అరెస్టు చేసింది. 40 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఈడీ ఉచ్చు బిగించింది. సందీప విర్క్ అనే ఈ ఇన్‌ఫ్లుయెన్సర్‌పై ఈ కేసు భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్‌లు 406 (క్రిమినల్ ట్రస్ట్ ఆఫ్ ట్రస్ట్), 420 (మోసం) కింద మొహాలీలోని పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌కి సంబంధించినది. ఇందులో మాయ మాటలు, తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల నుంచి డబ్బులు దండుకుంటున్నారని ఆరోపించారు.
మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) 2002 కింద మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళ, బుధవారాల్లో ఢిల్లీ, ముంబైలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ED ప్రకారం,.. సందీప విర్క్ మోసం ద్వారా స్థిరాస్తిని సంపాదించినట్లు ఆరోపణలు ఉన్నాయి. FDA-ఆమోదిత సౌందర్య ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు పేర్కొన్న hyboocare.com అనే వెబ్‌సైట్‌కు ఆమె తానే ఓనర్‌గా పేర్కొంది. అయితే.. ఈ ఉత్పత్తులు ఉనికిలో లేవని, వెబ్‌సైట్‌లో యూజర్ రిజిస్ట్రేషన్ ఫీచర్లు లేవని, పేమెంట్ గేట్‌వే నిరంతరం విఫలమవుతోందని.. సోషల్ మీడియాలో కూడా దీనికి ఉనికి లేదని విచారణలో కనుగొన్నారు.