లక్నో విమానాశ్రయంలో ఇండిగో విమానానికి తృటిలో పెనుప్రమాదం తప్పింది
లక్నో విమానాశ్రయంలో ఇండిగో విమానానికి తృటిలో పెనుప్రమాదం తప్పింది
లక్నో విమానాశ్రయంలో ఇండిగో విమానానికి తృటిలో పెనుప్రమాదం తప్పింది. లక్నో-దిల్లీ ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతోరన్‌వేపై వేగం అందుకున్న తర్వాత టేకాఫ్ విఫలం కావడంతో విమానంలో ఉన్న ప్రయాణికులు అందోళన చెందారు. ఒక్క నిమిషం ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురయ్యారు.
లక్నో విమానాశ్రయంలో...
అయితే పైలట్ చాకచక్యంతో అతికష్టంపై విమానాన్ని రన్‌వే మీద ఆపారు. దీంతో విమానంలో ఉన్న ప్రయాణికులతో పాటు ఉన్నతాధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. విమానంలో పార్లమెంటు సభ్యురాలు పుల్ యాదవ్ సహా 151 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే సేఫ్ గా విమానం ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.