పీఎస్ఎల్వీ సీ -62 రాకెంట్ ప్రయోగంలో అంతరాయం
భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన పీఎస్ఎల్వీ సీ -62 రాకెట్ ప్రయోగంలో అంతరాయం ఏర్పడింది
భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన పీఎస్ఎల్వీ సీ -62 రాకెట్ ప్రయోగంలో అంతరాయం ఏర్పడింది. నాలుగో దశలో సాంకేతిక లోపాన్ని గుర్తించినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. దేశ రక్షణ రంగానికి అత్యంత కీలకమైన ఈఓఎస్-ఎన్1 లేకపోతే అన్వేష ఉపగ్రహంాన్నికక్షలోకి తీసుకెళ్లిన రాకెట్ లో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ మేరకు ఇస్రో ఛైర్మన్ నారాయణన్ తెలిపారు.
సాంకేతిక కారణాలపై...
నాలుగు దశల్లో పూర్తి కావాల్సిన ఈ ప్రయోగంలో మూడు దశలువిజయవంతంగా ముగిసినప్పటికీ నాలుగో దశలో మాత్రం సాంకేతిక లోపం తలెత్తింది. దీనిపై సాంకేతిక గల కారణాలను విశ్లేషించి మరిన్ని వివరాలను ప్రకటిస్తామని ఇస్రో ఛైర్మన్ నారాయణన్ చెప్పారు. ఉదయం 10.18 గంటలకు ప్రారంభైన రాాకెట్ ప్రయోగం కాసేపటికే సాంకేతిక లోపం తలెత్తినట్లు గుర్తించారు. కక్షలోకి ప్రవేశపెట్టే సమయంలో అంతరాయం ఏర్పడిందని, దానిపై విశ్లేషణలు జరుపుతున్నామని నారాయణన్ వెల్లడించారు.