వచ్చే నెలలో శబరిమలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వచ్చే నెలలో శబరిమల సందర్శించనున్నారు.

Update: 2025-09-23 03:32 GMT

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వచ్చే నెలలో శబరిమల సందర్శించనున్నారు. తులమాస పూజ కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శబరిమల సందర్శించనున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శబరిమల పర్యటనపై రాష్ట్రపతి భవన్ నుండి అధికారిక నోటిఫికేషన్ అందిందని దేవస్వం మంత్రి వి.ఎన్. వాసవన్ తెలిపారు.

తేదీ తెలపకపోయినా...
ఖచ్చితమైన తేదీ ఇంకా ప్రకటించబడలేదు, కానీ ఆమె ఏ రోజు వచ్చినా ఆమె శబరిమలలో ఆలయాన్ని దర్శించుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు చేయనున్నట్లు ట్రావెన్ కోర్ బోర్డు తెలిపింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శబరిమలకు వస్తున్న సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయడానికికి ప్రభుత్వం మరియు దేవస్థానం బోర్డు సిద్ధంగా ఉన్నాయని ఆయన అన్నారు.


Tags:    

Similar News