ఢిల్లీలో ఓటేసిన రాష్ట్రపతి

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు

Update: 2024-05-25 07:33 GMT

సార్వత్రిక ఎన్నికల ఆరో విడత పోలింగ్‌ శనివారం కొనసాగుతోంది. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు క్యూ కట్టారు. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ స్థానాలకు ఈరోజు ఓటింగ్‌ జరుగుతోంది. ఇప్పటి వరకూ అందుతున్న సమాచారం మేరకు పోలింగ్ ప్రశాంతంగానే జరుగుతుంది.

ప్రతి ఒక్కరూ...
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఢిల్లీలోని పోలింగ్ కేంద్రానికి వెళ్లిన రాష్ట్రపతి ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్రపతి రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రపతిని దగ్గర నుంచి చూసేందుకు ప్రజలు ఉత్సాహపడ్డారు.


Tags:    

Similar News