అమెరికాలో భారతీయ యువతి హత్యకు గురయ్యారు. మెరీలాండ్ రాష్ట్రంలోని కొలంబియా ప్రాంతంలో ఉంటున్న నికిత గొడిశాల హత్యకు గురయిన ఘటన దిగ్భ్రాంతికి గురి చేసింి. నికితను ఆమె మాజీ ప్రియుడు అర్జున్ శర్మ హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్ారు. కొత్త సంవత్సరం వేడుకల తర్వాత నికిత కనిపించడం లేదని అర్జున్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హత్య చేసి భారత్ కు పరారై...
తనకు డిసెంబరు 31వ తేదీన చివరిగా ఎల్లికాట్ లోని తన అపార్ట్ మెంట్ లో చూశానని చెప్పాడు. అయితే జనవరి 2వ తేదీన అర్జున్ శర్మ భారత్ కు వెళ్లిపోయాడు. అయితే అమెరికా పోలీసులు అతని అపార్ట్ మెంట్ తనిఖీ చేయడంతో నికిత మృతదేహం బయటపడింది. నికిత శరీరంపై గాయాలు ఉండటంతో ఆమెను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే భారత్ కు పారిపోయిన అర్జున్ శర్మను పట్టుకోవడం కోసం అమెరికా పోలీసులు ప్రయత్నిస్తున్నారు.