మూడు నెలలు మండేకాలం.. 10 రాష్ట్రాల్లో గణనీయంగా పెరగనున్న ఉష్ణోగ్రతలు
ఏప్రిల్ నుంచి జూన్ వరకు దక్షిణ, వాయవ్య దేశంలోని కొన్ని ప్రాంతాలు మినహా అనేక చోట్ల సాధారణం కంటే తక్కువ..
high temperatures in india
ఏప్రిల్ మొదలు.. మూడు నెలల వరకూ దేశవ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఈ మేరకు భారత వాతావరణశాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర వివరాలు వెల్లడించారు.
బీహార్, ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, బంగాల్, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయని తెలిపారు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు దక్షిణ, వాయవ్య దేశంలోని కొన్ని ప్రాంతాలు మినహా అనేక చోట్ల సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందన్నారు. అలాగే ఏప్రిల్ నెలలో పలు ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.