జస్టిస్ సుదర్శన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సభ్యులు వ్యక్తిగత సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకుని పార్టీలతో సంబంధం లేకుండా తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. బీజేపీ అగ్రనేతల మద్దతు కోరేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నడం విశేషం.
ఆత్మప్రభోధం మేరకు...
సెప్టంబరు 9వ తేదీన ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నిక జరగనున్న నేపథ్యంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. సభ్యులు వ్యక్తిగత విషయాలను పరిగణనలోకి తీసుకుని, ఆత్మప్రభోధం మేరకు ఓటు వేయాలని కోరుతున్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇప్పటికే ఇండియా కూటమిలో ఉన్న అన్ని పార్టీలను కలసి మద్దతును కోరుతున్నారు