నేడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్

ఇండి కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి నేడు తన నామినేషన్ ను దాఖలు చేయనున్నారు.

Update: 2025-08-21 01:47 GMT

ఇండి కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి నేడు తన నామినేషన్ ను దాఖలు చేయనున్నారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా తెలంగాణ ప్రాంతానికి చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండి కూటమిలోని అన్ని పార్టీలూ ఏకగ్రీవంగా అభ్యర్థిగా నిలపాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. నేటితో ఉప రాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగియనుంది.

ఇండి కూటమి మద్దతుతో...
దీంతో నేడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి నేడు తన నామినేషన్ పత్రాలను పార్లమెంటు హౌస్ లో దాఖలు చేయాలని అన్నారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి ఇండి కూటమి నేతలు అందరూ హాజరు కానున్నారు. నామినేషన్ పత్రాలపై ఇండి కూటమి నేతలు ప్రపోజర్స్ గా ఉండనున్నారు. ఇప్పటికే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ నిన్న నామినేషన్ వేశారు. నేడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ వేయడంతో పోటీ అనివార్యమయింది. వచ్చే నెల 9వ తేదీన ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది.


Tags:    

Similar News