జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు
ఇండి కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి తన నామినేషన్ ను దాఖలు చేశారు
ఇండి కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి తన నామినేషన్ ను దాఖలు చేశారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా తెలంగాణ ప్రాంతానికి చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండి కూటమిలోని అన్ని పార్టీలూ ఏకగ్రీవంగా అభ్యర్థిగా నిలపాలని నిర్ణయించాయి. నామినేషన్ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు ఇండి కూటమి నేతలు హాజరయ్యారు.
నాలుగు సెట్ల నామినేషన్ ను...
జస్టిస్ సుదర్శన్ రెడ్డి మొత్తం నాలుగు సెట్ల నామినేషన్లను దాఖలుచేశారు. తెలంగాణలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి తన విద్యాభ్యాసాన్నిహైదరాబాద్ లో చేశారు. అనంతరం పలు రాష్ట్రాల్లో హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి, తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలను చేపట్టారు. నేటితో ఉప రాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగియనుండటంతో నేడు నామినేషన్ దాఖలు చేశారు. వచ్చే నెల 9వ తేదీన ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది.