Uttarakhand : నేటి నుంచి ఉమ్మడి పౌరస్మృతి అమలు

ఉత్తరాఖండ్ లో నేటి నుంచి ఉమ్మడి పౌరస్మృతిని ఆ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుంది.

Update: 2025-01-27 03:22 GMT

ఉత్తరాఖండ్ లో నేటి నుంచి ఉమ్మడి పౌరస్మృతిని ఆ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుంది. ఉత్తరాఖండ్ లో బీజేపీ అధికారంలో ఉంది. ఈ మేనరకు ీరజు నుంచి అమలులోకి తెస్తున్నామని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. దీంతో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ రికార్డుకు ఎక్కనుంది.

సమాన హక్కులు...
ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించి అన్ని ఏర్పాట్లను ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు. దీని అమలుకోసం అవసరమైన శిక్షణను కూడా అధికారులకు ఇచ్చారు. ఉమ్మడి పౌరస్మృతి అమలుతో రాష్ట్రంలో ఉన్న పౌరులందరికీ సమానమైన హక్కులు, బాధ్యతలు వస్తాయని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. ప్రజలు కూడా దీనిని స్వాగతించాలని ఆయన ఆకాంక్షించారు.


Tags:    

Similar News