Tamilnadu : తమిళనాడులో దంచి కొడుతున్న వర్షం. తుపాను ఎఫెక్ట్
తమిళనాడులో భారీ వర్షాలు పడుతున్నాయి
తమిళనాడులో భారీ వర్షాలు పడుతున్నాయి. వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు పడుతుండటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పలుచోట్ల కాలనీలు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమయింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని తమిళనాడు ప్రభుత్వం హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు పడుతున్నాయని, నదులు, వాగులు పొంగే అవకాశముందని హెచ్చరించింది.
వాయుగుండం ప్రభావంతో...
ప్రధానంగా వాయుగుండం ప్రభావంతో దక్షిణ తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, పుదుచ్చేరి తంజావూరులో భారీ వర్షాలు పడుతున్నాయని చెబుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరో ఇరవై నాలుగు గంటల్లో చెన్నై వద్ద తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులుహెచ్చరికలు జారీచేస్తున్నారు. తీరం దాటే సమయంలో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, చెట్ల కింద, హోర్డింగ్ ల కింద, విద్యుత్తు స్థంభాల వద్ద నిల్చోకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.