నేడు విద్యాసంస్థలకు సెలవు

తమిళనాడులో భారీ వర్షాలు పడుతున్నాయి

Update: 2025-11-29 02:53 GMT

తమిళనాడులో భారీ వర్షాలు పడుతున్నాయి. ద్వితా తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రంలోని ఆరు జిల్లాలకు ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ చేసింది. తంజావూరు, తిరువారూర్‌, మైలాడుదురై, విల్లుపురం, కడలూరు, కళ్లకురుచ్చిలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. తంజావూరు, తిరువారూర్‌లో పలుగ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి.

భారీ వర్షాలతో...
భారీ వర్షాలకు జలదిగ్బంధంలో తూత్తుకుడిలోని పలు గ్రామాలు చిక్కుకుపోయాయి. పుదుచ్చేరి, కారైకాల్‌లో విద్యాసంస్థలకు కూడా అధికారులు సెలవు ప్రకటించారు. ద్వితా తుపాను ప్రభావం తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలకు ఎక్కువగా ఉండటంతో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ముందుగానే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాయి.


Tags:    

Similar News