నేడు సుప్రీంకోర్టులో విచారణ

శివసేన పార్టీ గుర్తు, పేరుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

Update: 2023-02-22 03:52 GMT

శివసేన పార్టీ గుర్తు, పేరుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. పార్టీ గుర్తు, పేరును ఎన్నికల కమిషన్ ఏక్‌నాథ్ షిండే వర్గానికి కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే పార్టీ గుర్తు, పేరు తమకే దక్కాలంటూ మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. గుర్తు, పార్టీ పేరుపై సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నప్పటికీ ఎన్నికల కమిషన్ కావాలని ఒక వర్గానికి వాటిని కేటాయించిందని ఉద్ధవ్ థాక్రే ఆరోపిస్తున్నారు.

ప్రజలు నేరుగా..
ఎన్నికల కమిషన్ సభ్యులను ప్రజలు నేరుగా ఎన్నుకునేలా చూడాలని ఉద్ధవ్ థాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు చెందాల్సిన గుర్తు, పార్టీ పేరును వేరే వారికి కేటాయించడం ప్రజాస్వామ్య విరుద్ధమని థాక్రే అభిప్రాయపడుతున్నారు. థాక్రే వేసిన పిటీషన్ ను సుప్రీంకోర్టు స్వీకరించింది. నేడు విచారించనుంది.


Tags:    

Similar News