కుక్క పుట్టినరోజుకు 10 రాష్ట్రాల అతిథులు వచ్చారు!!

కుక్కలను అల్లారుముద్దుగా పెంచుతూ ఉంటారు కొందరు.

Update: 2025-06-04 11:24 GMT

కుక్కలను అల్లారుముద్దుగా పెంచుతూ ఉంటారు కొందరు. వాటికి పుట్టినరోజును కూడా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. అలా ఓ వ్యక్తి కుక్క పుట్టినరోజును అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఏకంగా 10 రాష్ట్రాల నుండి అతిథులు వచ్చారు ఈ పుట్టినరోజు వేడుకలకు.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌ జిల్లా గంగానగర్‌కు చెందిన వైద్యుడు షమీమ్‌ అహ్మద్‌ కు కుక్కలంటే ఎంతో ఇష్టం. ట్రాన్స్‌లామ్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌గా సేవలందిస్తున్న షమీమ్ కరోనా సమయంలో అలెక్స్‌ అనే కుక్కను పెంచుకోవడం మొదలుపెట్టారు. షమీమ్‌ తాజాగా అలెక్స్‌ 5వ పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. 10 రాష్ట్రాల నుంచి 500 మందికి పైగా అతిథులు వచ్చారు. ఈ వేడుకల్లో 11 కిలోల కేక్‌ను కట్‌ చేశారు. 30 రకాలకుపైగా వంటకాలను చేయించారు. ఇక పుట్టినరోజు సంబరాల్లో భాగంగా లక్కీ డ్రా నిర్వహించి రిఫ్రిజిరేటర్లను బహుమతిగా ఇచ్చారు. అలెక్స్‌ కోసం ఏకంగా ప్రత్యేక బంగ్లాను నిర్మించి, దాని బాగోగులు చూసేందుకు పనివాళ్లను కూడా నియమించారట.

Tags:    

Similar News