క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో ఉద్యోగి మృతి

రాజ్ కోట్ - సురాట్ లో క్రికెట్ ఆడుతుండగా ఓ యువకుడు కుప్పకూలిపోయాడు. సరిగ్గా అలాంటి ఘటనే అహ్మదాబాద్ లోనూ చోటుచేసుకుంది.

Update: 2023-02-26 04:14 GMT

GST employee died of heart attack 

గుండెపోటు.. ఇటీవల కాలంలో చిన్నా, పెద్దా తేడా లేకుండా వస్తోంది. స్కూల్ కి వెళ్లే పిల్లల నుండి వృద్ధుల వరకూ.. గుండెపోటుతో హఠాన్మరణం చెందుతున్నారు. ఇటీవల తెలంగాణలో 24 ఏళ్ల పోలీస్ కానిస్టేబుల్ జిమ్ లో వర్కవుట్స్ చేస్తూ.. ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత వైద్యులు పరిశీలించి అతను గుండెపోటుతో మరణించినట్లు నిర్థారిస్తున్నారు. తినే ఆహారంలో లోపమో, తాగే నీటిలో కలుషితమో, మరేదైనా కారణమో తెలీదు కానీ.. ఫిట్ లేకుండా ఊబకాయంతో ఉన్నవారితో పాటు.. ఫిట్ నెస్ మెయింటైన్ చేసేవారూ గుండెపోటుకు గురవుతున్నారు. తాజాగా గుజరాత్ మరో వ్యక్తి క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మరణించాడు.

రాజ్ కోట్ - సురాట్ లో క్రికెట్ ఆడుతుండగా ఓ యువకుడు కుప్పకూలిపోయాడు. సరిగ్గా అలాంటి ఘటనే అహ్మదాబాద్ లోనూ చోటుచేసుకుంది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. అహ్మదాబాద్ లో జీఎస్టీ ఉద్యోగులు సురేంద్రనగర్ జిల్లా పంచాయతీ సభ్యుల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో జీఎస్టీ ఉద్యోగి వసంత్ రాథోర్ ఆడుతున్నాడు. బౌలింగ్ చేస్తుండగా వసంత్ కు ఛాతీలో నొప్పి వచ్చి కిందపడిపోయాడు. కాసేపటికే అతను మృతిచెందాడు. వసంత్ ను పరిశీలించిన వైద్యులు అతను గుండెపోటుతో మరణించినట్లు తెలిపారు.


Tags:    

Similar News