Breaking : GSLV F14 ప్రయోగం సక్సెస్

శ్రీహరికోటలో నేడు జీఎస్ఎల్‌వీ ఎఫ్ 14 ప్రయోగం విజయవంతమయింది. సరిగ్గా 5.35 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది.

Update: 2024-02-17 12:31 GMT

శ్రీహరికోటలో నేడు జీఎస్ఎల్‌వీ ఎఫ్ 14 ప్రయోగం విజయవంతమయింది. సరిగ్గా 5.35 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. ఇన్‌శాట్ 3ని మోసుకెళ్లే జీఎస్ఎల్‌వీ ఎఫ్ 14 రాకెట్ ను నింగిలోకి దూసుకెళ్లిందది. వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఈ ర్యాకెట్ ను ప్రయోగించారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జీఎస్ఎల్‌వీ ఎఫ్ 14 ప్రయోగం జరిగింది.

పదేళ్లపాటు సేవలు...
నిన్న దీనికి సంబంధించి కౌంట్ డౌన్ ప్రారంభమయింది. ఇది 2,275 కిలోల బరువైన ఇన్‌శాట్ 3 డీఎస్ ను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శాస్త్రవేత్తలు రూపొందించారు. వాతావరణ పరిస్థితులతో పాటు, ప్రకృతి విపత్తుల హెచ్చరికల కోసం ఈ ర్యాకెట్ ఉపయోగపడనుంది. ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. వివిధ దశల్లో ఈ ర్యాకెన్ సురక్షితంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఇది పదేళ్ల పాటు సేవలందించనుంది. GSLV F14 ప్రయోగం సక్సెస్ కావడంతో ప్రధానితో పాటు ముఖ్యమంత్రులు, మంత్రులు శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.


Tags:    

Similar News