గుడ్ న్యూస్.. ఎనిమిది రోజులు ముందే రుతుపవనాలు
నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ఎనిమిది రోజుల ముందే కేరళను తాకాయి.
kerala
నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ఎనిమిది రోజుల ముందే కేరళను తాకాయి. లక్షద్వీప్‌తో పాటు కేరళ, కర్ణాటక, తమిళనాడు, మిజోరం రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలకూ రుతుపవనాలు విస్తరించాయి. సాధారణంగా జూన్ 1 నాటికి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తుంటాయి.
అంచనాల కంటే ముందుగా రుతుపవనాలు రావడం 25 ఏళ్లలో ఇది మూడోసారి కాగా 16 ఏళ్లలో ఇదే తొలిసారి. గతంలో 2001, 2009లలో మే చివర్లో దేశంలోకి ప్రవేశించాయి. ప్రస్తుతం అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం రుతుపవనాలను బలంగా ముందుకు లాగినట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు.