నేడు ఢిల్లీకి అశోక్ గజపతిరాజు

గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు

Update: 2025-08-01 03:30 GMT

గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం అశోక్ గజపతి రాజు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. గవర్నర్ గా బాధ్యతలు చేపట్టాక తొలిసారి అశోక్ గజపతిరాజు ఢిల్లీ వెళ్తున్నారు. ఇటీవల గోవా గవర్నర్ గా నియమితులై ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఢిల్లీకి ప్రయాణమయ్యారు.

రాష్ట్రపతి, ప్రధానిలను కలసి...
తన ఢిల్లీ పర్యటనలో గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలవనున్నారు. తర్వాత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను అశోక్ గజపతి రాజు కలవనున్నారు. రేపు ఢిల్లీలో ఉండి తిరిగి గోవాకు చేరుకుంటారు. అశోక్ గజపతి రాజుకు స్వాగతం పలికేందుకు టీడీపీ ఎంపీలు ఢిల్లీ విమానాశ్రయానికి రానున్నారు.


Tags:    

Similar News