ఢిల్లీలో గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు
గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు.
గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. గోవా గవర్నర్ గా నియమితులైన అశోక్ గజపతి రాజు ఢిల్లీ చేరుకున్నారు. ఆయన ఇప్పటికే ఇండియా గేట్ వద్ద నేషనల్ వార్ మెమోరియల్ ను సందర్శించారు. – దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికులకు గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు నివాళులు అర్పించారు.
రేపు రాష్ట్రపతితో భేటీ...
రేపు రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు కేంద్రమంత్రులను అశోక గజపతిరాజు కలవనున్నారు. కేంద్ర మంత్రిగా పనిచేసినప్పుడు అనేక మందితో సత్సంబంధాలున్న అశోక్ గజపతిరాజు గవర్నర్ పదవి వచ్చిన తర్వాత వెంటనే వారిని మర్యాదపూర్వకంగా కలవనున్నారు. గవర్నర్ పదవి ఇచ్చినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలియజేయనున్నారు.