మాజీ కేంద్ర మంత్రి శివరాజ్ పాటిల్ మృతి

మాజీ కేంద్ర మంత్రి శివరాజ్ పాటిల్ మరణించారు

Update: 2025-12-12 05:44 GMT

మాజీ కేంద్ర మంత్రి శివరాజ్ పాటిల్ మరణించారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.మహారాష్ట్రలోని లాతూర్ లోని నివాసంలోని ఆయన తుది శ్వాస విడిచారరు. శివరాజ్ పాటిల్ ఏడుసార్లు లోక్ సభకు ప్రాతినిధ్యం వహించారు. లాతూర్ నుంచి ఆయన ఏడు సార్లు ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే, ఎంపీ, కేంద్ర మంత్రిగా శివరాజ్ పాటిల్ అనేక హోదాల్లో పనిేశారు.

మున్సిపల్ కౌన్సిల్ చీఫ్ గా...
1935 లో జన్మించిన శివరాజ్ పాటిల్ తొలుత మున్సిపల్ కౌన్సిల్ చీఫ్ గా పనిచేశారు. అక్కడి నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన శివరాజ్ పాటిల్ 1991 నుంచి 1996 వరకూ లోక్ సభ స్పీకర్ గా బాధ్యతలను నిర్వహించారు. 2004-2008 వరకూ ఆయన కేంద్ర హోంమంత్రిగా ఉన్నారు. శివరాజ్ పాటిల్ పంజా్, చండీగడ్ లకు గవర్నర్ గా కూడా పనిచేశారు. శివరాజ్ పాటిల్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు సంతాపాన్ని ప్రకటించారు.


Tags:    

Similar News