మాజీ ముఖ్యమంత్రి మృతి

ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్ మరణించారు.ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు

Update: 2025-08-04 04:40 GMT

ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్ మరణించారు.ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న శిబూసోరెన్ ను కుటుంబ సభ్యులు ఢిల్లీలోని గంగారం ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయన ఈరో్జు శిబూ సోరెన్ తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

ప్రత్యేక రాష్ట్రం కోసం...
ఝార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన పెద్ద ఉద్యమమే నిర్వహించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన ఝార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీని ఏర్పాటు చేశారు. ఝార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత మూడు సార్లు శిబూ సోరెన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను నిర్వహించారు. ప్రస్తుతం ఆయన కుమారుడు ముఖ్యమంత్రిగా ఉననారు. 2004 నుంచి 2006 వరకూ కేంద్ర మంత్రిగా శిబూ సోరెన్ పనిచేశారు.


Tags:    

Similar News