ఈడీ ఎదుటకు యువరాజ్ సింగ్
మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ మంగళవారం మనీలాండరింగ్ కేసులో ఈడీ ముందు హాజరయ్యారు.
మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ మంగళవారం మనీలాండరింగ్ కేసులో ఈడీ ముందు హాజరయ్యారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో ఆయనను ప్రశ్నించినట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో కేంద్ర దిల్లీలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్న యువరాజ్‌ను అధికారులు విచారించి, మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు.
రేపు సోనూసూద్...
ఇదే కేసులో కేసులో ఇన్‌ఫ్లుయెన్సర్ అన్వేషి జైన్ కూడా ఈడీ ఎదుట హాజరయ్యారు. ఇప్పటికే మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్, రాబిన్ ఊతప్ప, మాజీ టీఎంసీ ఎంపీ, నటి మీమీ చక్రబర్తి, బెంగాలీ నటుడు అంకుష్ హజ్రాలను ఈడీ విచారించింది. ఇదే కేసులో నటుడు సోను సూద్‌కు బుధవారం హాజరుకావాలని ఈడీ నోటీసు జారీ చేసింది.