ములాయం సింగ్ కన్ను మూత

మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మృతి చెందారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు

Update: 2022-10-10 04:40 GMT

మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మృతి చెందారు. గతం కొన్ని రోజులుగా హర్యానాలోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. 82 ఏళ్ల వయసున్న ములాయం పరిస్థిితి విషమించిందని నిన్ననే వైద్యులు తెలిపారు. లోహియా, రాజ్ నారాయణ్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి ములాయం ప్రవేశించారు. ఎమెర్జెన్సీ కాలంలో ఆయన 16 నెలల పాటు జైలులో ఉన్నారు. ఆయన మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రాజకీయ పార్టీలు సంతాపాన్ని ప్రకటించాయి.

ఎనిమిది సార్లు...
1939 నవంబరు 22న ములాయం సింగ్ జన్మించారు. 1967లో తొలిసారి ములాయం సింగ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ములాయం ఎన్నికయ్యారు. 1989లో తొలిసారి ఆయన ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 1982లోనే యూపీ కౌన్సిల్ ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ములాయం రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. మొదటి భార్య మాలతీ దేవి కుమారుడు అఖిలేష్ యాదవ్ కాగా, రెండో భార్య సాధన కుమారుడు ప్రతీక్. ప్రస్తుతం ఆయన మెయిన్‌పురి పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతున్నారు.


Tags:    

Similar News