వియత్నాంలో భారీ వరదలు.. పదహారు మంది మృతి
వియత్నాంలో వరద బీభత్సం సృష్టిస్తుంది. అనేక ప్రాంతాల్లో జనజీవనం స్థంభించిపోయింది.
వియత్నాంలో వరద బీభత్సం సృష్టిస్తుంది. అనేక ప్రాంతాల్లో జనజీవనం స్థంభించిపోయింది. వరద నీరు పొంగి ప్రవహిస్తుండటంతో చాలా మంది నిరాశ్రయులయ్యారు. కొందరిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వియత్నాం ప్రభుత్వం సహాయక చర్యలను ప్రారంభించింది. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వియత్నాంను వరదలు ముంచెత్తాయి.
అనేక మంది నిరాశ్రయులుగా...
పదిహేను వందల మిల్లీ మీటర్లకు పైగా వర్షం కురవడంతో సెంట్రల్ వియత్నాంలోని చాలా ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల ఇప్పటి వరకు ఇప్పటి వరకూ పదహారు మంది చనిపోయారు. 43వేల నివాసాలు, 10వేల హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లినట్లు అక్కడి విపత్తు శాఖ తెలిపింది. చాలా ప్రాంతాలను వరద వీడకపోవడంతో ప్రజలు ఇళ్లపైకి చేరి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.