Plane Crash : తీవ్ర విషాదం.. ఒకే కటుంబంలో ఐదుగురి మృతి.. లండన్ కు వెళ్లి స్థిరపడదామనుకుని?

సాఫ్ట్ వేర్ ఇంజీనీర్ ప్రతీక్ జోషి కుటుంబంలోని ఐదుగురు అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు

Update: 2025-06-13 04:39 GMT

విదేశాలకు వెళ్లి స్థిరపడటం ఒక కల. దానిని సాకారం చేసుకునేందుకు అనేక మంది ప్రయత్నిస్తుంటారు.అలా ఆనందంగా బయలుదేరిన ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కుటుంబం అహ్మదాబాద్ లో జరిగిన విమానప్రమాదంలో మరణించింది. భర్త, భార్య, ముగ్గురు చిన్నారులు ఈ దుర్ఘటనలో మరణించారు. కుటుంబం మొత్తం విదేశాల్లో స్థిరపడి మంచి జీవితాన్ని అనుభవించాలనుకుంటే.. విధివక్రీకరించి విమాన ప్రమాదంలో అందరూ మరణించిన ఘటన కలచివేస్తుంది. విమానంలో కూర్చున్న తర్వాత వారు దిగిన చివరి సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదే వారి చివరి సెల్ఫీ అని ఊహించి ఉండరు. సెల్ఫీ పోస్టు చేసిన క్షణాల్లోనే ప్రమాదం జరిగి కుటుంబం మొత్తం ప్రమాదంలో మరణించింది.

ఆరేళ్లుగా అక్కడే ఉంటూ...
ప్రతీక్ జోషి ఆరు సంవత్సరాలుగా లండన్‌లో నివసిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ అయిన ఆయన, తన భార్య మరియు ముగ్గురు చిన్న పిల్లల కోసం లండన్ లో ఉంటున్నారు.భార్య మిగిలిన ముగ్గురు పిల్లలు ఇండియాలోనే ఉన్నారు. ఇప్పటి వరకూ వీసాలు వంటివి రాకపోవడంతో పాటు ప్రతీక్ జోషి భార్య వైద్యురాలిగా ఉండటంతో ఆమె ఉద్యోగానికి రాజీనామా చేయడానికి కొంత సమయం పట్టింది. తగిన అనుమతుల కోసం సంవత్సరాలుగా వేచి ఉన్న తర్వాత ఇటీవల అన్ని అనుమతులు లభించాయి. తన కల నెరవేరబోతుందని ప్రతీక్ జోషి భావించారు. రెండు రోజుల క్రితం, ఉదయపూర్‌లో ప్రఖ్యాత వైద్యురాలు అయిన అతని భార్య డాక్టర్ కోమి వ్యాస్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.
వీడ్కోలు చెప్పి...
లండన్ కు ప్రయాణమయ్యారు. ఆనందంంతో కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు వీడ్కోలు పలికారు. లండన్ వెళుతున్నామన్న ఉత్సాహంతో ఉన్న ఐదుగురు సభ్యుల కుటుంబం లండన్‌కు వెళ్లే ఎయిర్ ఇండియా విమానం 171 ఎక్కారు. విమానంలో సెల్ఫీ తీసుకున్నారు. దానిని బంధువులకు పంపారు. తాము కొత్త జీవితాన్ని నేటి నుంచి ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. అదే వారికి చివరి క్షణలయ్యాయి. విమాన ప్రమాదంలో ఐదుగురు కుటుంబ సభ్యులు మరణించడంతో ఇక్కడ ఉన్న ప్రతీక్ జోషి కుటుంబ సభ్యులు, సన్నిహితులు విషాదంలో మునిగిపోయారు. జీవితం అంటే ఇంతేనేమో. ఎవరికీ ఎన్నిరోజులు భూమి మీద నూకలు ఉంటే అన్నిరోజులు మాత్రమే బతుకుతారనడానికి ప్రతీక్ జోషి కుటుంబం ఉదాహరణ.


Tags:    

Similar News