Operation Sindoor : మాతో పెట్టుకోకు.. మాడి మసై పోతారు.. నాడు ఇందిర నేడు మోదీ
దేశానికి బలవంతమైన నాయకత్వం ఉంటే ఎలాంటి ప్రయోజనాలు అందుతాయో అందరికీ మరోసారి తెలిసి వచ్చింది
దేశానికి బలవంతమైన నాయకత్వం ఉంటే ఎలాంటి ప్రయోజనాలు అందుతాయో అందరికీ మరోసారి తెలిసి వచ్చింది. వారిని నియంతలని విమర్శలుచేయవచ్చు. అలాగే ఏకపక్ష వైఖరిని తూలనాడవచ్చు. కానీ శత్రువులకు మాత్రం ఆ నాయకత్వం పదవిలో ఉంటే చాలు.. ఇటువైపు చూసేందుకే భయపడతారు. ప్రధానంగా పాక్ - ఇండియా మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యలో మరోసారి ఈ చర్చ మొదలయింది. గతంలో ఇందిరా గాంధీ పేరు కూడా ప్రపంచ వ్యాప్తంగా ఇలాగే మారు మోగిపోయింది. ఐరన్ లేడీగా ప్రపంచ దేశాలు ఇందిరను అభివర్ణించాయి. మాతో పెట్టుకుంటే మసి అయిపోతారు అన్న సంకేతాలు ఇవ్వగల నేతగా ప్రధాని పదవిలో ఉంటే చాలు ప్రత్యర్థులు కూడా కన్నెత్తి చూసేందుకు జడుస్తారు.
చిరకాలం గుర్తుండిపోయేలా...
ఇందిరా గాంధీకి, నేటి మోదీకి పోలికలు చూపుతూ అనేక మంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. చిరకాలం గుర్తుంచుకునే పేర్లుగా ఇందిరాగాంధీ తర్వాత మోదీ పేరు మారుమోగుతుందనే చెప్పాలి. ఇందిరా గాంధీ మహిళ అయినా ఎవరినీ లెక్క చేయలేదు. ఫస్ట్ ఇండియా నినాదంతో నాడు అమెరికాను కూడా ఆ దేశంలోనే థిక్కరించి వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. కాశ్మీర్ విషయంలో తమ వైఖరి మారదని, ఇతరుల జోక్యం కూడదని ఇందిర నాడు తెగేసి చెప్పారు. నేడు కూడా మోదీ అదేరకమైన సందేశాన్ని ప్రపంచానికి పంపగలిగారు మధ్యవర్తిత్వం అంటే మాటలు ల్లేవ్ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ అమెరికాకు కూడా ఇవ్వగలిగారు. ఇక మోదీ ఆపరేషన్ సిందూర్ ను నిర్వహించిన తీరుతో ఒక్కసారిగా దేశంలోనే కాదు ప్రపంచంలోనూ శక్తి గల నాయకుడిగా ఎదిగారు.
కాలుపెడితే చాలు...
ఉగ్రవాదులు మాటు వేసి అమాయకులు ప్రాణాలు తీస్తే..వారి ఉగ్రవాద స్థావరాలపైనే దాడులకు దిగి వాటిని నాశనం చేసిన తర్వాత భారత్ అంటే ఏంటో ప్రపంచంతో్ పాటు పాకిస్తాన్ కు కూడా ఘాటుగా చెప్పగలిగారు.మెత్తగా ఉంటే మొత్తబుద్ధవుతుందన్న సామెత ఊరికే రాలేదు. అందుకే మోదీ కఠిన వైఖరి భారత దేశ కీర్తిప్రతిష్టలను మరింత పెంచిందనే చెప్పాలి. అలాగే పాక్ తీవ్రవాదులకు అండగానిలుస్తుందని మరొకసారి ప్రపంచం ముందు నగ్నంగా నిలబెట్టడంలో మోదీ సక్సెస్ అయ్యారు. ఉగ్రవాదులకు కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మా దేశంలోకి కాలు పెడితే మసి చేస్తామని చెప్పి వారి వెన్నులోనూ వణుకుపుట్టించేలా చేశారు. అందుకే భారత్ కు సమర్థవంతమైన, బలమైన నాయకత్వం ఉంటేనే ఇలాంటి కన్నెత్తి చూసేందుకు కూడా భయపడతారు.
రాజనీతితోనే...
మన గడ్డమీదకు దొంగల్లా వచ్చి అమాయకులను మట్టుపెట్టిన వారిని ఊరికే విడిచిపెట్టకూడదు. అందుకే భారత్ ఇకపై పాక్ తో జరిగే చర్చల్లో రాజీ అన్న మాటకు తావివ్వకుండా ఉగ్రవాదులను అప్పగించే లక్ష్యంతోనే ముందుకు సాగాలని ప్రతిఒక్కరూ కోరుకుంటున్నారు. యుద్ధంలో అనేక తంత్రాలు ఉంటాయి. ఒక్కోసారి తగ్గాలి. అప్పుడే నెగ్గుతాం. కాల్పుల విరమణపై కొందరు చేస్తున్న విమర్శలకు సమాధానం చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ దేశాల మద్దతు కావాలంటేకొన్నిసార్లు దౌత్యనీతితో వ్యవహరించాలి. ఆవేశాలకు పోతే అనర్థాలేవస్తాయి. రాజనీతితో చేసేవే సక్సెస్ అవుతాయి. మోదీ వ్యవహరించిన తీరు వల్లనే నేడు ప్రపంచ దేశాల నుంచిభారత్ కు మద్దతు లభిస్తుంది. పాక్ ఇతర దేశాల మద్దతుకోసం ప్రయత్నిస్తున్నా ఏ మాత్రం కుదరడం లేదు. అందుకే మోదీ ఎంచుకున్న మార్గమే సరైనదన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.