నేడు కూడా దేశ వ్యాప్త సమ్మె
నేడు కూడా కార్మిక సంఘాలు దేశ వ్యాప్త సమ్మె చేయనున్నాయి.
నేడు కూడా కార్మిక సంఘాలు దేశ వ్యాప్త సమ్మె చేయనున్నాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రెండురోజుల పాటు కార్మిక సంఘలు దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. బీజేపీ యేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సమ్మె ప్రభావం కొంత నిన్న కన్పించింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో బంద్ పూర్తిగా విజయవంతం కాగా, మిగిలిన ప్రాంతాల్లో పాక్షికంగా సక్సెస్ అయింది.
అత్యవసర సేవలకు......
నిన్న అత్యవసర సేవలకు విఘాతం కలగకపోవడంతో ప్రభుత్వాలు కూడా ఊపిరి పీల్చుకున్నాయి. నేడు కూడా కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునివ్వడంతో రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో పోలీసులు భద్రతను మరింత పెంచారు. లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, ప్రభుత్వ సంస్థల ప్రయివేటీకరణ ఆలోచనను మానుకోవాలని కోరుతూ దేశంలోని అన్ని కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి.