విజయ్ కు మద్రాస్ హైకోర్టులో ఎదురు దెబ్బ
టీవీకే చీఫ్ విజయ్ కు మద్రాస్ హైకోర్టులో ఎదురు దెబ్బతగిలింది.
టీవీకే చీఫ్ విజయ్ కు మద్రాస్ హైకోర్టులో ఎదురు దెబ్బతగిలింది. విజయ్ వేసిన పిటీషన్ మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. విజయ్ ఆదాయపు పన్నులెక్కలు సమర్పించలేదని ఆ శాఖ నోటీసులు జారీ చేసింది. దీంతో పాటు 1.50 కోట్ల రూపాయల జరిమానా విధించింది. పన్ను చెల్లింపులో లెక్కలు సమర్పించనందుకు ఈ జరిమానా విధించింది.
జరిమానా నోటీసుపై...
ఆదాయపు పన్ను శాఖ ఇచ్చిన జరిమానా నోటీసుపై మద్రాస్ హైకోర్టును టీవీకే చీఫ్ విజయ్ ఆశ్రయించారు. ఈ పిటీషన్ పై విచారణ జరిపి జరిమానాను కొట్టివేస్తూ ఆదేశాలివ్వాలని కోరారు. అయితే ఆదాయపు పన్ను శాఖ జరిమానా కు వ్యతిరేకంగా వేసిన పిటీషన్ ను మద్రాస్ హైకోర్టు తోసి పుచ్చింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశముంది.