230 కోట్ల లాటరీ.. ఇంజినీరుకు కలిసొచ్చిన లక్

లక్కు.. ఎప్పుడు, ఎవరిని, ఎలా పలకరిస్తుందో అసలు ఊహించలేము. అలా ఓ విశ్రాంత ఇంజినీరు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్ లో ఓ లాటరీ టికెట్ కొనగా, లాటరీ లక్కీ డ్రాలో ఏకంగా 230 కోట్ల రూపాయలు గెలుపొందారు.

Update: 2025-05-26 09:28 GMT

లక్కు.. ఎప్పుడు, ఎవరిని, ఎలా పలకరిస్తుందో అసలు ఊహించలేము. అలా ఓ విశ్రాంత ఇంజినీరు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్ లో ఓ లాటరీ టికెట్ కొనగా, లాటరీ లక్కీ డ్రాలో ఏకంగా 230 కోట్ల రూపాయలు గెలుపొందారు. చెన్నైకి చెందిన శ్రీరామ్‌ రాజగోపాలన్‌ సౌదీ అరేబియాలోని ఓ స్థిరాస్తి కంపెనీలో 20 ఏళ్ల పాటు పని చేసి అక్కడే స్థిరపడ్డారు.


మార్చి 16న తన పుట్టిన రోజు సందర్భంగా ఆన్‌లైన్‌లో మెగా 7 గేమ్‌ లాటరీ కొన్నారు. ఇటీవల జరిగిన లక్కీ డ్రాలో ఆయనకు మొదట లాటరీ తగిలిందని తెలిసింది. చూస్తే లాటరీ నంబరుకు ఏకంగా 230 కోట్ల రూపాయల బహుమతి వచ్చింది. ఈ డబ్బును క్యాన్సర్‌ బాధితులకు సేవ చేయడానికి ఉపయోగిస్తానని రాజగోపాలన్‌ చెప్పడం విశేషం.


Tags:    

Similar News