జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ఉగ్రవాది హతం

జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాది మరణించాడు

Update: 2025-04-25 06:27 GMT

జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాది మరణించాడు . జమ్మూకాశ్మీర్ లోని బండిపోరా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. లష్కర్ తోయిబాకు చెందిన ఉగ్రవాది అల్తాఫ్ లాలిని భద్రతాదళాలు చంపేశాయి. ఈరోజు ఉదయం నుంచి జరిపిన కాల్పుల్లో అల్లాఫ్ మరణించినట్లు అధికారులు తెలిపారు. బండిపోరా జిల్లాలో ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో భద్రతాదళాలు కార్టన్ సెర్చ్ నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈ దాడి జరిగింది.

పక్కా సమాచారంతో...
ఆ ప్రాంతంలోనే దాగి ఉన్నారన్న పక్కా సమాచారంతో భద్రతాదళాలు కాల్పులు జరిపాయి. అయితే మాటు వేసిన ఉగ్రవాదులు కూడా భద్రతాదళాలపై ఎదురు కాల్పులకు పాల్పడ్డారు. జమ్మూకాశ్మీర్ లోని పహాల్గాంలో టూరిస్టులపై జరిగిన దాడి తర్వాత భద్రతాదళాలు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా ఈ ఎన్ కౌంటర్ జరిగింది. పహాల్గామ్ దాడి తర్వాత నాలుగో ఎన్ కౌంటర్ ఇది. ఈ ఎన్ కౌంటర్ లో ఒక ఉగ్రవాది గాయపడగా, ఇద్దరు భద్రతా సిబ్బంది కూడా గాయపడ్డారు. గాయపడిన భద్రతా సిబ్బందిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


Tags:    

Similar News