జమ్ము కాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్ము కాశ్మీర్ లో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు.

Update: 2025-07-28 08:21 GMT

జమ్ము కాశ్మీర్ లో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. శ్రీనగర్ లోని దాచిగమ్ నేషనల్ పార్క్ సమీపంలో భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురుకాల్పులు జరిగాయి. అయితే ఇప్పటి వరకూ ముగ్గురు ఉగ్రవాదులు మరణించినట్లు చెబుతున్నారు. అయితే వీరు పహాల్గాం దాడిలో పాల్గొన్న వారని ప్రచారం జరుగుతున్నా దానిపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.

ఆపరేషన్ మహదేవ్ పేరిట...
ఆపరేషన్ మహదేవ్ పేరిట జమ్మూకాశ్మీర్ పోలీసులు, సైన్యం, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారు ఎవరన్నది తెలియాల్సి ఉంది. హర్వాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు సమాచారం రావడంతో గాలింపు చర్యలు కొనసాగుతుండగా ఉగ్రవాదులు చనిపోయారని అంటున్నారు. శ్రీనగర్ లో జరిగిన ఈ ఎన్ కౌంటర్ లో ఆసిఫ్ ఫైసా, సులేమాన్ షా, అబు తల్హా మృతి చెందినట్లు తెలిసింది. వీరిలో ఒక్కోఉగ్రవాదిపై ఇరవై లక్షల రివార్డు ఉన్నట్టు సమాచారం.


Tags:    

Similar News