ఉప రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్ విడుదల
ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది.
ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. సెప్టంబరు9వ తేదీన ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఇటీవల ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమయింది. ఈ నెల 21 వతేదీ నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువు 25వ తేదీగా నిర్ణయించారు.
సెప్టంబరు 9వ తేదీన...
ఉప రాష్ట్రపతి ఎన్నికలో పార్లమెంటు సభ్యులు పాల్గొంటారు. సెప్టంబరు 9వ తేదీ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను చేయాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. జులై 21వతేదీన జగదీప్ ధన్ ఖడ్ రాజీనామా చేశారు.