ముగిసిన ఉప రాష్ట్రపతి ఎన్నికలు

భారత ఉప రాష్ట్రపతి ఎన్నిక ముగిసింది. పార్లమెంటు సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు

Update: 2025-09-09 12:20 GMT

భారత ఉప రాష్ట్రపతి ఎన్నిక ముగిసింది. పార్లమెంటు సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఎన్డీఏ కూటమి నుంచి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్, ఇండి కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ చేశారు. ఆరు గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

కాసేపట్లో కౌంటింగ్...
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తమదే గెలుపు అన్న ధీమాతో ఎన్డీఏ ఉంది. ఖచ్చితంగా ఊహించని మెజారిటీతో విజయం సాధిస్తామని వారు చెబుతున్నారు. అదే సమయంలో తమకు క్రాస్ ఓటింగ్ వల్ల లాభం చేకూరుతుందని, ఖచ్చితంగా గెలుస్తామని ఇండి కూటమి చెబుతుంది. మరో గంట, రెండు గంటల్లో ఉప రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.


Tags:    

Similar News