రేపు ఢిల్లీలో ఎన్నికల కమిషన్ సమావేశం
రేపు ఢిల్లీలో ఎన్నికల కమిషన్ సమావేశం జరగనుంది. రేపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు
రేపు ఢిల్లీలో ఎన్నికల కమిషన్ సమావేశం జరగనుంది. రేపు మధ్యాహ్నం మూడు గంటలకు నిర్వాచన్ సదన్ కార్యాలయంలో భేటీ జరగనుంది. పలు రాజకీయ పార్టీలతో ఎన్నికల కమిషన్ అధికారులు చర్చించనున్నారు. ఎన్నికల సంస్కరణలు, అభ్యర్థనలపై ఈసీ అధికారులు చర్చించనుంది. ఇప్పటికే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు ఈ సమావేశానికి ఆహ్వానం పంపింది.
ఢిల్లీకి కేటీఆర్...
అయితే రేపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. భారత ఎన్నికల కమిషన్ నిర్వహించే సమావేశానికి హాజరుకానున్నారు.కేటీఆర్ తో పాటు సమావేశానికి కేఆర్ సురేశ్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, బోయినపల్లి వినోద్‌కుమార్, బాల్క సుమన్, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరుకానున్నారు.ఎన్నికల సంసరణలు, ఇప్పటికే ఈసీఐకి సమర్పించిన వివిధ అభ్యర్థనలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సంబంధిత అంశాలపై చర్చించే అవకాశం ఉంది.