Breaking : ఢిల్లీలో భూప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు

ఢిల్లీలో భూప్రకంపనలు భయాందోళనలకు గురి చేశాయి.

Update: 2025-07-10 03:48 GMT

ఢిల్లీలో భూప్రకంపనలు భయాందోళనలకు గురి చేశాయి. గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్ లో భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈరోజు ఉదయం 9.04 గంటల ప్రాంతంలో ఈ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు తెలిసింది. రిక్టర్ స్కేల్ పై 4.1 గా భూకంప తీవ్రతగా నమోదయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

సెకండ్ల పాటు...
సుమారు పది నుంచి ముప్ఫయి సెకండ్ల పాటు భూమి కంపించిందని చెబుతున్నారు. అయితే భూ ప్రకంపనలు రావడంతో ఒక్కసారిగా ఉదయం లేచి పనుల్లో ఉన్న వారు బయటకు పరుగులు తీశారు. సెంట్రల్ ఢిల్లీతో పాటు ఘజియాబాద్ లో ఎక్కువగా ఈ భూప్రకంపనలు బాగా కనిపించినట్లు తెలిసింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఎటువంటి వదంతులను నమ్మవద్దని ప్రభుత్వం చెబుతుంది.


Tags:    

Similar News