Karnataka : కర్ణాటకలో భూకంపం..తీవ్రత ఎంతంటే?
కర్ణాటక రాష్ట్రంలోని విజయపురం జిల్లాలో భూకంపం సంభవించింది
కర్ణాటక రాష్ట్రంలోని విజయపురం జిల్లాలో భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున 2.9 తీవ్రతతో స్వల్ప భూకంపం సంభవించింది. ఈ విషయాన్ని అధికారులు ప్రకటించారు. భూకంప తీవ్రత తక్కువగా ఉండటంతో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈరోజు ఉదయం 7.43గంటలకు ఈ భూకంపం సంభవించింది. ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
విజయపురం జిల్లా...
విజయపురం జిల్లా బసవాణ బగేవాడి తాలూకాలోని యరణాల్ గ్రామపంచాయతీ పరిధిలోని హట్టర్కిహాల్ గ్రామానికి వాయువ్య దిశగా 2.5 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉనట్లు గుర్తించారు. ఐదు కిలోమీటర్ల లోతులో భూకంపం చోటుచేసుకున్నట్లు పేర్కొంది. భూకంప ప్రభావం సుమారు 50 నుంచి 60 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే స్వల్పంగా కనిపించింది.