Manipur Earth Quake : మణిపూర్‌లో భూకంపం.. తీవ్రత ఎంతంటే?
మణిపూర్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 3.9 తీవ్రతగా నమోదయింది.
earthquake, magnitude, richter scale, Manipur
Manipur Earth Quake :మణిపూర్‌లో భూకంపం సంభవించింది. ఈరోజు తెల్లవారు జామున జరిగిన భూప్రకంపనలకు ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఉదయం 6.56 గంటలకు భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. రిక్టర్ స్కేల్ పై 3.9 తీవ్రతగా నమోదయింది.
భూకంప తీవ్రత...
మణిపూర్ లోని ఉఖ్రుల్ లో ఈ భూకంపం సంభవించింది. అయితే ఈ భూకంపం కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే భూకంప తీవ్రత స్వల్పంగానే ఉండటంతో ఎలాంటి నష్టం జరగలేదని తెలుస్తోంది.