Earth Quake : జమ్మూ కాశ్మీర్‌లో భూకంపం.. తీవ్రత ఏ స్థాయిలో అంటే?

జమ్మూ కాశ్మీర్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై ఈ భూకంప తీవ్రత 5.5 గా నమోదయింది

Update: 2024-02-20 02:59 GMT

earthquake, magnitude, richter scale, Manipur

జమ్మూ కాశ్మీర్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై ఈ భూకంప తీవ్రత 5.5 గా నమోదయింది. ఉత్తర కాశ్మీర్ లో భూకంప కేంద్రం ఉందని సెంటర్ ఆఫ్ సిస్మోలజీ అధికారులు తెలిపారు. భూకంప కేంద్రం భూమికి పది కిలోమీటర్ల లోతులో ఉందని చెప్పారు. జమ్మూ కాశ్మీర్ తో పాటు లడఖ్ లోనూ ఈ భూకంపం సంభవించింది.

ఆస్తినష్టం మాత్రం...
ఈ భూకంప తీవ్రతకు భయపడి ఇళ్లలో నుంచి జనం బయటకు పరుగులు తీశారు. భూకంపం కారణంగా ఎంత మేర ఆస్తినష్టం జరిగిందన్నది తెలియరాలేదు. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్ లో తరచూ భూకంపాలు సంభవిస్తుండటంతో ప్రజలు భయపడిపోతున్నారు.


Tags:    

Similar News