జమ్మూకాశ్మీర్ లో భూకంపం

జమ్మూకాశ్మీర్ లో భూమి కంపించింది. ఈ తెల్లవారు జామున భూ ప్రకంపనలు కనిపించాయి. రిక్టర్ స్కేల్ పై 3.6 తీవ్రత నమోదయింది.

Update: 2023-02-17 04:53 GMT

జమ్మూకాశ్మీర్ లో భూమి కంపించింది. ఈరోజు తెల్లవారు జామున భూ ప్రకంపనలు కనిపించాయి. రిక్టర్ స్కేల్ పై 3.6 తీవ్రతగా నమోదయింది. జమ్మూ కాశ్మీర్ లోని కట్రా ప్రాంతంలో ఈ భూకంప ప్రకంపనలు కలకలం రేపాయి. ప్రజలు ఆందోళనలతో రోడ్లపై పరుగులు తీశారు. భయాందోళనలకు లోనయ్యారు. పది కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది.

ప్రాణ, ఆస్తి నష్టం...
అయితే జమ్మూ కాశ్మీర్ లో సంభవించిన భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టమూ జరగలేదని అధికారులు వెల్లడించారు. కట్రా పట్టణానికి తూర్పున 97 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించిందని అధికారులు తెలిపారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.


Tags:    

Similar News