డీఆర్డీఓ ఎస్కేప్ సిస్టమ్ ప్రయోగం సక్సెస్

భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ డీఆర్‌డీఓ యుద్ధ విమానాల్లో అత్యవసర పరిస్థితుల్లో పైలట్‌ ప్రాణాలను కాపాడే ఎస్కేప్ సిస్టమ్‌ను విజయవంతంగా పరీక్షించింది.

Update: 2025-12-03 14:25 GMT

భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ డీఆర్‌డీఓ యుద్ధ విమానాల్లో అత్యవసర పరిస్థితుల్లో పైలట్‌ ప్రాణాలను కాపాడే ఎస్కేప్ సిస్టమ్‌ను విజయవంతంగా పరీక్షించింది. భారత వైమానిక దళ పైలట్ల భద్రతను మరింత పటిష్ఠం చేసే ఈ పరీక్ష, దేశీయ రక్షణ పరిజ్ఞానంలో ఒక మైలురాయిగా నిలిచింది. చండీగఢ్‌లోని టెర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చ్ ల్యాబ్ ఆధ్వర్యంలోని రైల్ ట్రాక్ రాకెట్ స్లైడ్ కేంద్రంలో ఈ డైనమిక్ పరీక్షను నిర్వహించారు. ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సహకారంతో ఈ ప్రయోగం జరిగింది. ఈ పరీక్ష కోసం తేజస్ యుద్ధ విమానం ముందు భాగాన్ని పోలిన ఒక డ్యుయల్ స్లైడ్ వ్యవస్థను ఉపయోగించారు. పైలట్ స్థానంలో ప్రత్యేక సెన్సార్లు అమర్చిన 'ఆంత్రోపోమార్ఫిక్ టెస్ట్ డమ్మీ'ని ఉంచి, ప్రమాద సమయంలో పైలట్‌పై పడే ఒత్తిడి, వేగాన్ని నమోదు చేశారు.

Tags:    

Similar News