Narendra Modi : పాక్ ను మోకాళ్ల పై కూర్చోబెట్టిందిదే
దీపావళి వేడుకలను ఐఎన్ఎస్ విక్రాంత్ లో జరుపుకోవడం ఆనందంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
దీపావళి వేడుకలను ఐఎన్ఎస్ విక్రాంత్ లో జరుపుకోవడం ఆనందంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గోవా తీరంలో ఐఎన్ఎస్ విక్రాంత్ లో నేవీ దళంతో కలిసి ఆయన దీపావళి వేడుకలను జరుపుకున్నారు. ఐఎన్ఎస్ విక్రాంత్ పాకిస్తాన్ ను మోకాళ్లపై కూర్చోబెట్టిందన్నారు. పాక్ కు నిద్రలేని రాత్రులను మిగిల్చిందని అన్నారు. పాక్ నౌకలు అడుగు ముందుకు వేయాలంటే భయపడిపోయాయని నరేంద్ర మోదీ తెలిపారు. ఆపరేషన్ సింధూర్ లో ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రభావంతంగా పనిచేసిందన్నారు.
ఐఎన్ఎస్ విక్రాంత్ తో...
ఒకవైపు అనంతమైన ఆకాశం ఉంటే.. మరొకవైపు అనంత శక్తులున్న ఐఎన్ఎస్ విక్రాంత్ ఉందని నరేంద్ర మోదీ అన్నారు. ఐఎన్ఎస్ విక్రాంత్, ఆత్మ నిర్భర్ భారత్ మేడిన్ ఇండియాకు నిదర్శనమని తెలిపారు. భారత సైన్యంలో నావికాదళం సేవలు మరువలేవని నరేంద్ర మోదీ చెప్పారు. దేశాన్ని భద్రంగా ఉంచడంలో సైనికుల పాత్రను ఈ దేశం మరువలేదని అన్నారు. అందుకే తాను ఈరోజు ఐఎన్ఎస్ విక్రాంత్ లో నావికాదళం సమక్షంలో దీపావళి పండగ జరుపుకోవాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. దేశ రక్షణలో ఉన్న ప్రతి సైనికుడికి తన వందనం అని మోదీ అన్నారు. సైనికుల ధైర్యసాహసాలను ఈ దేశం మరిచిపోదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.